హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కావాలనే ఇరికించారు: కోస్తాంధ్ర డీఐజీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లాప్‌టాప్‌ను కొనుక్కునేందుకు తెచ్చుకున్న డబ్బును కవర్‌లో పెట్టుకొన్నాను. కానీ దాన్ని కొనలేదు. పొరపాటున ఆ కవరును ఐజి టేబుల్‌పైన పెట్టి మరిచిపోయాను. అంతేకానీ ఐజికి లంచం ఇస్తానని చెప్పలేదు.కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. అని కోస్తాంధ్ర జైళ్ల డిఐజి శామ్యూల్‌ జాన్సన్‌ మీడియాకు తెలిపారు.

ప్రమేషన్ విషయంలో జైళ్ల శాఖ అదనపు డీజీ లోకేంద్ర శర్మకు యాభై వేలు ఇచ్చేందుకు యత్నించిన ఆ శాఖ కోస్తా జిల్లాల రీజియన్‌ డీఐజీ శామ్యూల్‌ జాన్సన్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కోస్తాంధ్ర జైళ్ళ డిఐజి శామ్యూల్‌ జాన్సన్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. అయితే జైళ్ళశాఖ ఉన్న తాధికారుల మధ్య విభేదాలే ఇందుకు కారణమని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటకీయ పరిణామాల మధ్య ఎసిబి అధికారులు డిఐజి శామ్యూల్‌ జాన్సన్‌ ను పట్టుకుని అరెస్టు చేశారు. అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఆర్‌.గిరీశ్‌కుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ చారుసిన్హా చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రా రీజియన్‌ డిఐజిగా శామ్యూల్‌ జాన్సన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అడిషనల్‌ ఐజి ప్రమోషన్‌కోసం సీనియారిటీని పొందడానికి అతను కొంత కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫైల్‌ రాష్ట్ర జైళ్లశాఖ ఐజి లోకేంద్రశర్మ వద్ద పెండింగ్‌లో ఉంది.దాంతో మంగళవారం సాయంత్రం డిజిపి లోకేంద్రశర్మ కార్యాలయానికి వెళ్ళిన శామ్యూల్‌ జాన్సన్‌ 50వేల రూపాయలను లోకేంద్రశర్మ టేబుల్‌పై ఉంచి తనకు పదోన్నతి త్వరగా లభించేలా చూడాలని కోరారు.నాకే లంచం ఇస్తావా?' అంటూ కోపంతో లోకేంద్రశర్మ అవినీతి నిరోధకశాఖ అధికారులకు సమాచారం అందించారు.

చారుసిన్హా నేతృత్వంలో ఎసిబి అధికారుల బృందం లోకేంద్రశర్మ కార్యాలయానికి చేరు కుని శామ్యూల్‌ జాన్సన్‌ యాభైవేల రూపాయలను లోకేం ద్రశర్మకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదంటున్నారు శామ్యూల్‌.. తాను అందరికంటే సీనియారిటీలో ముందున్నాననీ, అడిషనల్‌ ఐజి ప్రమోషన్‌ ఎప్పుడో రావాల్సి ఉందని, ఐజి లోకేంద్రశర్మకు లంచం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.లాప్‌టాప్‌ కంప్యూటర్‌ కొనడానికి వచ్చానని, దానికోసం తెచ్చుకున్న క్యాష్‌ కవర్‌ మిస్‌ప్లేస్‌ కావడంవల్లనే తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారనీ శామ్యూల్‌ తెలిపారు.అని కోస్తాంధ్ర జైళ్ల డిఐజి శామ్యూల్‌ జాన్సన్‌ మీడియాకు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X