హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలకు స్పీకర్ క్షమాపణలు

By Staff
|
Google Oneindia TeluguNews

KR Suresh Reddy
హైదరాబాద్: శాసనసభలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనలకు స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత విచారకరమైన దినమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభలో జరిగిన సంఘటనలపై విచారణకు ఆదేశించానని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. శాసనసభలో జరిగిన సంఘటనలకు తమని తామే నిందించుకోవాలని ఆయన అన్నారు. నేటి సంఘటన సిగ్గు పడాల్సిన సంఘటన అని ఆయన అభిప్రాయపడ్డారు.

శాసనసభలో జరుగుతున్న వ్యవహారాల తీరును చూసి సభను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సభ్యుల సస్పెన్షన్ గానీ, మార్షల్స్ చేత బయటకు పంపించడం గానీ కొత్తేమీ కాదని ఆయన అన్నారు. మార్షల్స్ కూడా ప్రభుత్వోద్యోగులేనని, తన ఆదేశాల మేరకే వారు పనిచేశారని ఆయన అన్నారు. సస్పెండ్ చేసిన తర్వాత సభ్యులు తమంత తాము సభ నుంచి వెళ్లిపోవాలని, అలా వెళ్లనప్పుడు మార్ష్లల్స్ చేత బయటకు పంపడం ఆనవాయితీ అని ఆయన చెప్పారు. విచారణలో ఎవరిని ఏమన్నారో బయట పడుతుందని ఆయన అన్నారు. శాసనసభలో చర్చకు, నిరసనకు, ఆందోళనకు, విభేదాలకు అవకాశం ఉందని, అయితే ఈ విషయాల్లో గీత దాటకూడదని, గీత దాటితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X