హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదంతా దేవుడి దయ: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: "ప్రమాణ స్వీకారానికి ముందే వర్షం కురవడం భగవంతుడి దయ. ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం" అని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం గవర్నర్‌ ను కలుసుకుని, అక్కడి నుంచి గాంధీ భవన్‌ కు బయలుదేరగానే భారీగా వర్షం పడింది. దీనిపై ముఖ్యమంత్రి ప్రతిస్పందించారు. "గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా వర్షాలు పడడంతో చరిత్రలో తొలిసారిగా రిజర్వాయర్లన్నీ నిండి, పంటలు పుష్కలంగా పండాయి. రైతులు బాగుపడ్డారు. రెండోసారి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే వర్షాలు పడటం శుభసూచకం. ఇదంతా భగవంతుడి దయ" అని ఆయన అన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

బుధవారం లాల్‌ బహదూర్‌ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలెవ్వరూ పూలదండలు, బొకేలు, శాలువాలు వంటికి తీసుకురావద్దని ముఖ్యమంత్రి కోరారు. వీటిపై పెట్టే అనవసర ఖర్చును ప్రజాప్రయోజన కార్యక్రమాలపై వెచ్చించాలన్నారు. 'ఆరోగ్యశ్రీ'కి విరాళంగా ఇవ్వాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేరిట డీడీలు, చెక్కులు పంపించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X