హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏదో ఒకరోజు జయం సాధిస్తాం: చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సామాజిక న్యాయంతో ఏదో ఒక రోజు విజయం సాధిస్తామని ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. తమది ఓటమి కాదని జనంలోకి వెళ్ళి పోరాడుతామని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పూలే వర్దంతి సమావేశంలో చిరంజీవి ప్రసంగించారు.

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తానే పట్టుబట్టి సామాజిక న్యాయం మేరకు పార్టీ తరఫున 104 మంది బీసీలకు టిక్కెట్లు ఇప్పించానని చెప్పారు.. ఏడాదిన్నర కిందట పార్టీ ఏర్పాటుకు ముందు తనకు పూలే అంటే ఎవరో తెలియదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావించినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నానని చెప్పారు. అసమానతలు తొలగించటానికి అంబేద్కర్‌, పూలే వంటి మహానుభావులు కృషి చేస్తేనే పూర్తిస్థాయి ఫలితాలు ఇప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని వర్గాలదే ఆధిపత్యంగా ఉందని, మిగిలిన వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. శాసనసభలో పూలే విగ్రహం పెట్టేలా, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. పార్టీ భావజాల ప్రతినిధి కత్తి పద్మారావు మాట్లాడుతూ ''కాంగ్రెస్‌లో ఎన్నటికీ పార్టీ విలీనం కాదు... ఎదురు నిలబడి పోరాడుతుంది'' అంటూ వేదికపై నుంచి గట్టిగా నినాదాలు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఎన్‌.టి.రామారావు సామాజిక న్యాయాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లారని, తెదేపాలో నాయకత్వం మారాక దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X