నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కృష్ణయ్య అనే కానిస్టేబుల్ సెల్ టవర్ ఎక్కి తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తేనే కిందకు దిగుతానని డిమాండ్ చేశాడు. పోలీసులు ఎంతి బతిమాలినా కిందకు దిగలేదు. అర్థరాత్రి వరకు అలాగే ఉన్నాడు.
సోమవారం అర్థరాత్రి సమయంలో కృష్ణయ్య తన వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణయ్య మృతదేహం సెల్ టవర్ పైనే చిక్కుకుంది. దీంతో తాళ్లతో శవాన్ని కిందకు దింపారు. కృష్ణయ్య రాసి పెట్టిన స్యూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మరణంతోనైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతం కావాలని ఆశిస్తున్నానని అతను ఆ లేఖలో రాశాడు.