తెలంగాణ రాష్ట్రానికి సెటిలర్స్ ఫోరం మద్దతు

దశాబ్దాల క్రితమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ తాము ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో మమేకమయ్యామని తెలిపారు. ప్రస్తుత పరిణామాలు సెటిలర్లకు భయం కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. "మా రాష్ట్రంలో..మా సోదరుల మధ్య రెండో శ్రేణి పౌరులుగా ఉన్నామా?" అంటూ విస్మయం వ్యక్తంచేశారు. సెటిలర్లు ఏర్పాటు చేసిన విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు అన్నీ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. తమ ప్రాథమిక, రాజ్యాంగ, మానవ హక్కులకు భంగం కలిగించొద్దని టీఆర్‌ఎస్‌ను కోరారు.
ఉద్యమంలో భాగంగా ఇందిరాగాంధీ, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేయాలంటూ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పిలుపునివ్వడం ఆయన సంస్కారానికి తగదన్నారు. ఆంధ్రా భోజనశాల, ఆంధ్రా టిఫిన్స్ వంటి వాటి పేర్లు మారుస్తూ, వ్యాపార సంస్థలపై దాడులు జరగకుండా చూడాలని కోరారు.