ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి బాంబర్ బస్సుల కాన్వాయ్ ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆత్మాహుతి బాంబర్ నడిచి వచ్చి హంగు జిల్లాలోని థాల్ పెట్రోల్ వద్ద వరుస కట్టిన వాహనాల వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు.
అది ఆత్మాహుతి దాడేనని కోహట్ కమిషనర్ ఖలీద్ ఖాన్ ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు తర్వాత థాల్ లోని మార్కెటును మూసేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.