హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిపై పోలీసు స్టేషన్ లో ఒయు జెఎసి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కొమరం పులి నిర్మాతల నుంచి ఒయు జెఎసి నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై వారు తీవ్రంగా మండిపడ్డారు. ప్రకటనల ద్వారా తమ పరువుకు భంగం కలిగించారని, విశ్వవిద్యాలయం వాతావరణాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉస్మానియా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శోభారాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొంటూ ఆమెపై కూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 24 గంటల్లోగా ఆధారాలతో రుజువు చేయాలని, లేకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ చిరంజీవిని హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఐదు గంటలతో ఓయూ జేఏసీ విధించిన గడువు ముగిసింది. దీంతో జేఏసీ నేతలు చిరంజీవిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై చేసిన ఆరోపణలను చిరంజీవి, శోభారాణి రుజువు చేయాలని, లేకపోతే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రకటనల ద్వారా వారు తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ నేతలు అంజన్న, భాస్కర్, రవీంద్రనాయక్, క్రిషాంక్, అంబేద్కర్, దరువు ఎల్లన్న, రాజేష్, రవి నాయక్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా చిరంజీవి, శోభారాణి వ్యాఖ్యానించారని, తమ పరువుకు భంగం కలిగించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారని ఉస్మానియా వర్సిటీ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు. ఫిర్యాదును స్వీకరించామని, కానీ కేసును నమోదు చేయలేదని చెప్పారు. ఇది పరువుకు సంబంధించిన అంశమని, దీనిని న్యాయస్థానంలోనే చూసుకోవాలని వివరించారు. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణలు తమ పరిధిలో జరగలేదని, ఇది పూర్తిగా సివిల్ వివాదమని చెప్పారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X