వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఎన్నారై వోటింగ్ రైట్స్ డ్రైవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI Voting
మిల్పిటాస్: ఎన్నారైలకు అబ్సెంటీ వోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతూ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో జరిగిన ఎన్నారై వోటింగ్ రైట్స్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పీపుల్ ఫర్ లోకసత్తా, మానవత డాట్ ఆర్గ్, భారత కమ్యూనిటీ సెంటర్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పెద్ద యెత్తున హాజరయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక రంగానికి, ఇతర రంగాలకు ఎన్నారైలు చేస్తున్న సేవలను శరత్ మంగళపల్లి వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నా ఎన్నారైలకు భారతదేశంలో ఓటింగ్ హక్కు కల్పించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎన్నారైలకు వోటింగ్ హక్కు కల్పించే బిల్లు త్వరలో లోకసభ ఆమోదానికి వస్తోందని, అయితే పోలింగ్ రోజు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి ఓటు వేయాలనే నిబంధన అమలు ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. అబ్సెంటీ ఓటింగ్ హక్కును కల్పించాలని, అది ఇంటర్నెట్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తుందని, అది సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్, సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ నరేన్ భక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇష్టాగోష్టి, చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను రెండు అమెరికా, భారత అస్తిత్వాలతో జీవిస్తున్నానని ఆయన చెప్పారు. అబ్సెంటీ వోటింగ్ హక్కు కోసం జరుగుతున్న ప్రచారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఎన్నారైలను కోరారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు బ్లూప్రింట్ తయారు చేసిన జట్టులో ఉన్న భక్షి విద్య, ఇ-గవర్నెన్స్, ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధన రంగాల్లో భారత - అమెరికా సంయుక్త భాగస్వామ్యానికి గల అవకాశాలను వివరించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు నిజమైన భారతీయుడిగా, నిజమైన అమెరికన్ గా ఉండడానికి వీలుందని చెప్పారు. భారత ప్రభుత్వంపై పోరాడడానికి బదులు విస్తృతమైన చర్చలో పాలు పంచుకోవాలని ఆయన సూచించారు.

అవినీతి, మద్యం వంటి వాటి ద్వారా ప్రలోభ పెట్టడానికి వీలు కాదు కాబట్టి భారత రాజకీయ నాయకులు కొందరు ఎన్నారైలకు అబ్సెంటీ వోటింగ్ హక్కును కల్పించడానికి ఇష్టపడడం లేదని అతాను దేయ్ అన్నారు. అదృష్టవశాత్తు తాను భారత పౌరసత్వాన్ని కాపాడుకోగలిగానని బే ఏరియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అనిత అన్నారు. ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తే ఎన్నారైలు భారత్ వెళ్లడానికి 1500 డాలర్లు ఖర్చు చేయడానికి బదులు పోస్టల్ బ్యాలెట్ కు ఐదు డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతుందని ఆమె అన్నారు. డ్రైవ్ ను తానా అధ్యక్షుడు జయరామ్ కోమటి బలపరిచారు.

బేరియా పీపుల్స్ ఫర్ లోకసత్తా వాలంటీర్ శ్రీకాంత్ కొచ్చర్లకోట ప్రచారోద్యమానికి జరిగే వ్యయాన్ని వివరించారు. కర్ణాటక పార్లమెంటు సభ్యులకు ఎన్నారై వోటింగ్ హక్కుపై గల అవగాహన పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను కర్ణాటకకు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X