హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిదంబరంకు కెసిఆర్ ఝలక్: ఒక్కరిని పిలిస్తేనే వస్తామన్న తెరాస

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: హోంమంత్రి చిదంబరానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ అంశంపై జనవరి 6వ తారీఖున పార్టీకి ఒక్కరినే పిలవాలని ఆయన చిదంబరానికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. పార్టీకి ఇద్దరిని పిలవడం సరియైన పద్ధతి కాదన్నారు. కేంద్రం పద్ధతి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉందన్నారు. పార్టీకి ఇద్దరిని పిలిస్తే ఇరు ప్రాంతాల వారు రెండు వాదనలు వినిపిస్తారని అలాంటప్పుడు ఉపయోగమేమిటని కెసిఆర్ ప్రశ్నించారు. పార్టీకి ఒక్కరిని పిలిస్తేనే తాము వస్తామని కరాఖండిగా చెప్పారు.

పార్టీకి ఇద్దరిని పిలవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమస్యను జఠిలం చేసే విధంగా కేంద్రం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతుందన్నారు. తెలంగాణ అంశాన్ని నానబెట్టడం సరికాదని ఆయన సూచించారు. చర్చలకు పిలిచి దృష్టి మరల్చే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందన్నారు. చిదంబరం తన పద్ధతిని ఇప్పటికైనా మార్చుకొని పార్టీకి ఒక్కరినే పిలవాలని సూచించారు. గత అఖిలపక్షంలో అన్ని పార్టీలనుండి ఇద్దరు హాజరు కావటం వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తిందో ఇప్పడు అలాగే ఉందన్నారు.

డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటకను కట్టుబడి ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యమని మేం మొదటినుండి స్పష్టంగా చెబుతున్నామన్నారు. తెలంగాణకు ఆంధ్రప్రాంత ప్రజలు వ్యతిరేకంగా లేరని ఆయన చెప్పారు. పిడికెడు మంది మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వారు కూడా సొంత లాభాలకోసమేనని చెప్పారు. బయటకు రాని నివేదికపై ఊహాజనితాలు సరికాదని శ్రీకృష్ణ కమిటీ నివేదికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X