హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఢిల్లీ రావాల్సిందిగా బుధవారం పిలుపు వచ్చింది. అధిష్టానం పిలుపుతో సిఎం కిరణ్ గురువారం ఉదయం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కారణంగా గురువారం శాసనసభ ఉండదు, తిరిగి శుక్రవారం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రితో రాష్ట్రంలోని పలు పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, రానున్న ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొనడంపై, తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై అధిష్టాంతో మాట్లాడనున్నారు. త్వరలో జరిగనున్న శాసనమండలి ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రితో అధిష్టానం చర్చించనుంది.
Chief Minister Kirankumar Reddy will leave for New Delhi tomorrow morning. Congress High Command was called him to talk on Telangana issue and MLC election.
Story first published: Wednesday, February 23, 2011, 16:56 [IST]