హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవ్యాప్తంగా రైల్ రోకో, పలువురు రాజకీయ నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు ఇచ్చిన పల్లె పల్లె పట్టాలపైకి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మంగళవారం రైల్‌రోకో కొనసాగుతోంది. హైదరాబాదు సమీపంలోని మౌలాలి రైల్వేస్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.నిజామాబాద్‌లో తెలంగాణవాదులు రైలు పట్టాల వెంబడి బైఠాయించారు. ఈ సందర్భంగా బిజెపి శాసనసభ్యుడు లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తెలంగాణవాదులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా న్యాల్కల్‌ ప్రాంతంలో రైలుపట్టాలపై తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. మూసాయిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు పట్టాలపై బైఠాయించారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. బీబీనగర్‌ గూడ్స్‌రైలును అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతినేత కవిత పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వేమార్గంపై టైర్లకు నిప్పుబెట్టారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు మౌలాలిలో జరిగిన ఆందోళనలో తెరాసకు చెందిన సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ పాల్గొన్నారు. నాంపల్లిలో ఆందోళనకు దిగిన ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌, విమలక్కతదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

ఘట్‌కేసర్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందర్ని కలుపుకువెళుతామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రైల్‌రోకో సందర్భంగా దక్షిణమధ్యరైల్వేపరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. జంటనగరాల్లో అన్నీ ఎంఎంటీఎస్‌ సర్వీసులు, తెలంగాణ ప్రాంతంలో ప్యాసింజర్‌ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రైల్వేవర్గాలు ప్రకటించాయి. సికింద్రాబాద్‌నుంచి బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌, శాతవాహన, పల్నాడు, గోల్కోండ, సింహపురి,గౌతమి, షిర్డిసాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌... తదితర సర్వీసులను రద్దు చేశారు. పొద్దునే వివిధప్రాంతాలనుంచి జంటనగరాలకు చేరుకునే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌కు చేరుకునే రైళ్లను ఎక్కడైనా ఆపేస్తే అక్కడ నుంచి ప్రయాణీకులను ఆర్టీసీ బస్సుల్లో వారి గమ్యానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్టను పూర్తిచేశారు.

English summary
Rail Roko programme is going in Telangana demanding proposal Telangana bill in Parliament. TDP Telangana leaders participated in rail roko at Secunderabad railway station. JAC chairman Kodandaram participated at Ghatkeshar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X