డిఎస్ ఆజ్ఞతో మిలియన్ మార్చ్‌కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరం!

అయితే వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదేశాల మేరకే మార్చ్‌లో పాల్గొనలేదని తెలుస్తోంది. డి.శ్రీనివాస్ హెచ్చరికల మేరకే వారి వెనక్కి తగ్గినట్లుగా వినిపిస్తోంది. కాగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న భావన సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు. కేవలం ప్రజాప్రతినిధులలోనే ఉందని చెప్పారు. కొందరు సీమాంధ్ర ఎంపీలు కూడా రాష్ట్ర విడిపోతేనే బాగుంటుందనే భావనతో ఉన్నారన్నారు.
రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. పలువురు సీమాంధ్ర ఎంపీలు గురువారం మన్మోహన్ సింగ్‌ను కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను అందించిన నివేదిక ప్రకారం తెలంగాణ సమస్యను పరిష్కరించమంటూ చెబుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.