కోదండరామ్‌తో విభేదించిన కిషన్ రెడ్డి, డి. శ్రీనివాస్‌పై ఆగ్రహం

తెలంగాణ అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మన్నుతిన్న పాములా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీకి పిండ ప్రధానం చేస్తామన్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. కాగా కిషన్‌రెడ్డి ప్రభుత్వంపై కూడా విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిష్కరించకుండా ఉండడానికే సమావేశాలను వాయిదా వేస్తుందన్నారు. ఉషామెహ్రా కమిషన్, ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదా, అకాల వర్షాలు, తుఫానులతో సుమారు 15 జిల్లాల్లో నష్టపోయిన రైతులు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసుల ఎత్తివేత తదితర విషయాలపై చర్చకు రాకుండానే స్పీకర్ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. అసెంబ్లీ పిండ ప్రదానానికి తాము హాజరు కాబోమని ఆయన చెప్పారు.