చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపికి కాంగ్రెసు ఓటు: జగన్ వర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
చిత్తూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతంలోకి అనుమతి లేకుండా వచ్చిందుకే అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను కర్ణాటక ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. జగన్ వర్గానికి చెందిన మరో నేత, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కాగా చిత్తురు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ వింత ఓటింగ్‌కు తెర దీసింది. బద్ద శత్రువు, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి తన రెండవ ప్రాధాన్యత ఓటును వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అనంతపురంలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వర్గం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇస్తూ టిడిపికి ఓట్లు వేస్తున్నారనే వాదనలు వచ్చాయి. చిత్తూరులో కూడా కాంగ్రెసు జగన్ వర్గం అభ్యర్థిని ఘోరంగా ఓటమికి గురి చేయడానికి తమ రెండవ ప్రాధాన్యత ఓటును టిడిపికి వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జిల్లాలో చేతకాని ముఖ్యమంత్రిగా నిలబెట్టుదామనే ఉద్దేశంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో జగన్ వర్గాన్ని దెబ్బతీయడానికి సిఎం కాంగ్రెసుచే టిడిపికి ఓటు వేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా నెల్లురూ జిల్లా కావలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డిని ఆర్డీవో అడ్డుకున్నారు. దీంతో ఇరువురుకి తీవ్ర వాదులాట జరిగింది. మరోచోట జగన్ వర్గం, కాంగ్రెసు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీంగ్ కేంద్రాల వద్ద కాంగ్రెసు నేతలు ప్రచారం చేస్తున్నారంటూ జగన్ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.

English summary
Police arrested Ex MP YS Jaganmohan Reddy camp MLA Peddireddy Ramachandra Reddy and TUDA former chairman Chevireddy Bhaskar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X