ఆంధ్ర నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ కన్నుమూత

ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో మార్చి 31, 1933లో జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశారాయన. మీనాక్షీ సుందరం పిళ్లే, నాయుడుపేట రాజమ్మ ఆయన గురువులు. సోదరుడు శ్యామ్‌సుందర్ స్ఫూర్తితో ముందుకు సాగిన రామకృష్ణ దేశం గర్వించేలా ఆంధ్రుల సంప్రదాయ నృత్యకళకు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ఆంధ్రనాట్యాన్ని పునరుద్ధరించిన ఘనత ఆయనదే. దక్షిణాది నృత్యరీతులమీద ఎన్నో పుస్తకాలు రాశారు. వందలాది మంది శిష్యులకు శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దారు.