హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జులై రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు: రమాకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramakanth Reddy
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను జులై రెండో వారంలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆ విషయం చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 21వ తేదీకల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఎంపిటీసి, జడ్‌పిటీసి ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 60.50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోవని, ప్రభుత్వం స్థానిక సంస్థలను ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

English summary
State election commissioner Ramakanth Reddy announced that election for local bodies will be held in July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X