యువతి గొంతు కోసి హత్య: సోదరులపై రాళ్ల వర్షం, గాయాలు

వారు సబీహపై దాడి చేస్తున్న సమయంలో ఆమె సోదరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు సబీహ సోదరులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె సోదరులు కూడా కొద్దిగా గాయపడ్డారు. సబీహా వయసు 19 ఏళ్లు. ఆమె స్థానికంగా ఉంటే ఓ కళాశాలలో బిఇడి చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. సబీహా హత్యలో పాత గొడవలు గానీ, లావాదేవీల గొడవలు కానీ లేదా ప్రేమ కోణం ఉందా అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.