తిరువనంతపురం: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద వెలికితీతకు న్యాయపోరాటం చేసిన సుందర్‌రాజన్ ఆదివారం మరణించారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుందర్‌రాజన్ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వేసిన పిటిషన్‌తోనే శ్రీపద్మనాభస్వామి ఆలయ సంపద వెలుగు చూసింది. మాజీ ఐపీఎస్ అయిన సుందర్‌రాజన్ ఇంటెలిన్స్ అధికారిగా సేవలందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతాధికారిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన లాయర్‌గా ఉన్నారు.
కేరళ పద్మనాభస్వామి ఆలయంలో నిధుల లెక్క తేల్చాలంటూ సుప్రీంకోర్టుకి సుందరరాజన్ దరఖాస్తు చేశారు. ఆయన వయసు 70సంవత్సరాలు. సుందరరాజన్ విజ్ఞప్తి మేరకే సుప్రీంకోర్టు నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ ఆలయం నేలమాళిగలోని నిధుల లెక్కింపు మొదలుపెట్టింది. సుందరరాజన్ 1964 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి.