అనంతపురం: శ్రీ సత్య సాయి బాబా ట్రస్టు సభ్యులపై ప్రభుత్వ అధికారులకు అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. సోమవారం యజుర్మందిరంలోని మూడు గదులలోని డబ్బును ట్రస్టు సభ్యులు లెక్కించనున్నాయి. ఈ లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ అధికారులు సైతం హాజరు కానున్నారు. గతంలో యజుర్మందిరంలోని సంపదను లెక్కించిన సమయంలో కేవలం ట్రస్టు సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరూ పాల్గొనలేదు. అయితే అప్పుడు లెక్కింపు సమయంలో భారీగా నిధులు బెంగుళూరు తరలించారనే ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు ట్రస్టు సభ్యులు యజుర్మందిరంలోని సంపదను లెక్కించాక ఈ నెల 2వ తారీఖున జాయింట్ కలెక్టర్ సోదాలు జరిపినప్పుడు మరో డెబ్బై లక్షల రూపాయలకు పైగా బయట పడింది. దీంతో అధికారులలో ట్రస్టు సభ్యులపై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. సోమవారం యజుర్మందిరంలోని మూడు గదుల్లోని సంపద లెక్కింపు సమయంలో అధికారులు సైతం పాల్గొంటారు.
The AP government is suspecting Sri Sathya Sai Baba Trust members on counting of Trust property. Today the government officers will participated in counting.
Story first published: Monday, July 18, 2011, 9:45 [IST]