వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మూటీని ఏడు గంటలు ప్రశ్నించిన ఐటి అధికారులు

|
Google Oneindia TeluguNews

Mammootty
కొచ్చి: మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీని ఆదాయం పన్ను శాఖ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. మాలయళ హిరో మమ్మూటీ కార్యాలయాలు, ఇళ్లపై ఆదాయ పన్ను అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపిన విషయం తెల్సిందే. అయితే షూటింగ్ లో ఉన్న మమ్మూటీ చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9గంటలకు పానమ్ పిల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అధికారులతో శనివారం తెల్లవారుఘూము వరకు సహకరించిన మమ్మూటీ దాదాపు 7 గంటల పాటు వారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

అయితే చెన్నై నుంచి బయలు దేరేందుకు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్న మమ్మూటీకి భారీగా తరలి వచ్చని అభిమానులు అండగా నిలిచారు. మమ్మూటీ ఇంటికి చేరుకున్న తరువాత మరిన్ని సోదాలు నిర్వహించామని ఆదాయ పన్ను శాఖ అదనపు సంచాలకులు ఆర్.మోహన్ తెలిపారు. భూములకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను సేకరించామని, తమ దాడుల వివరాలను బుధవారం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

మమ్మూటీ, మోహన్ లాల్ ల ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల పై మూకుమ్మిడిగా సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కొచ్చి, తిరువనంతపురం, చెన్నై, బెంగుళూరు, ఊటీలలోని ఆస్తుల పై దృష్టి సారించారు. షూటింగ్ ల నేపధ్యంలో రామేశ్వరంలో ఉన్న మోహన్ లాల్ ను చెన్నైలో 25వ తేదిన, కొచ్చిలో 26వ తేదిన ప్రశ్నించనున్నట్లు అధికారి మోహన్ తెలిపారు. వీరికున్న ఆస్తులు, వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఆదాయపన్నులు చెల్లించటం లేదంటూ వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు గత కొద్ది కాలంగా వీరి ఇరువురి ఆస్తుల పై నిఘా వేశారు. అయితే రాజ్యాంగం పరిధిలోని సెక్షన్ 132ను అనుసరించి ఐటీ అధికారులు విచారణనను డీల్ చేస్తున్నారు.

English summary
Income Tax officials, who had conducted raids at the residence and business establishments of Malayalam superstar Mammootty, questioned him for nearly seven hours till early Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X