వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిగొచ్చిన యడ్యూరప్ప, రేపు ఒంటి గంటకు రాజీనామా

యడ్యూరప్ప తీరు పట్ల బిజెపి అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం రాత్రి అధిష్టానం పరిశీలకులు అగ్రనేత ఎల్‌కె అద్వానీతో మాట్లాడినట్లు సమాచారం. మాట వినకపోతే యడ్యూరప్పపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన వారికి సూచించినట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు వల్ల పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంతో యడ్యూరప్పను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏ విధమైన షరతులు లేకుండానే యడ్యూరప్ప రాజీనామా చేస్తారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప చెప్పారు.
కాగా, యడ్యూరప్ప రాజీనామా కోసం ఎదురు చూస్తున్నామని, యడ్యూరప్ప రాజీనామా తర్వాతనే కొత్త నేత ఎంపిక జరుగుతుందని బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. అధిష్టానానికి యడ్యూరప్ప ఎదురుతిరగడం మంచిది కాదని ఆయన అన్నారు. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన చెప్పారు.