అన్నాహజారే మొండివైఖరి వల్లే అరెస్టు: మన్మోహన్

జెపి పార్కులో దీక్షకు దిగడానికి సిద్ధమైన అన్నా ఢిల్లీ పోలీసుల షరతులను ఉల్లంఘించారన్నారు. అందుకే అరెస్టు చేశారని అన్నారు. ముందుజాగ్రత్త చర్యగానే అన్నాతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్టు ప్రకటన చేశారు. 144 సెక్షన్ ఉల్లంఘిస్తానని ఆగస్టు 15న అన్నా ప్రకటన చేశారని చెప్పారు. అన్నాను రిమాండుకు తరలించాని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరలేదన్నారు. కోర్టు చెప్పిన నిబంధనలకు అన్నా ఆమోదం తెలుపనందునే తీహారు జైలుకు తరలించినట్లు చెప్పారు. జెపి పార్కు వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షకు అనుమతించేది లేదన్నారు. శాంతియుత నిరసనలకు ప్రభుత్వం ఎప్పుడూ అనుమతిస్తుందన్నారు.
తాను రూపొందించిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని అన్నా పట్టుబడుతున్నారని అది సరియైనది కాదన్నారు. బిల్లు పాసు కావడం అందరికీ ఆమోదయోగ్యమే అయితే బిల్లు ఎవరు రూపొందించాలి. ఎవరు ఆమోదించాలన్నదే అసలు ప్రశ్న అన్నారు. బిల్లు త్వరగా రూపొందించి ఆమోదం పొందడానికి అందరూ సహకరించాలని అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం అన్నా ఎంచుకున్న మార్గం మాత్రం సరియైనది కాదన్నారు. పార్లమెంటులో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు. కాగా ప్రధాని మాట్లాడుతున్న సమయంలో విపక్షాలు ఆయనకు అడ్డు తగిలాయి.












Click it and Unblock the Notifications