హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాకు కెసిఆర్‌కు ముత్యం రెడ్డి షరతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Muthyam Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ముత్యం రెడ్డి మంగళవారం కొన్ని షరతులు పెట్టారు. ఇటీవల తనపై జరుగుతున్న వరుస దాడులకు తీవ్ర మనస్థాపం చెందిన ముత్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బుజ్జగింపులతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. రాజీనామా వార్తల నేపథ్యంలో ముత్యం రెడ్డి మీడయాతో మాట్లాడారు. తెలంగాణ కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అయితే కెసిఆర్ తన షరతులకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేస్తే త్యాగం ఎలా అవుతుందని కాబట్టి రాజీనామాలు చేశాక ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయవద్దన్నారు. ఎవరూ పదవుల్లో లేకుండా పోరాటం చేయాలన్నారు. ఏ ఒక్కరో కాకుండా అందరం కలిసి రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి తద్వారా తెలంగాణ సాధించాలన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా పోరాటం చేద్దామన్నారు. బిజెపి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం మాట్లాడుతున్న సమయంలో కెసిఆర్ ఇక్కడ ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాటం చేయకుండా దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం అందరినీ కలుపుకు పోవాలన్నారు. అందుకు కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో మీ కుటుంబ సభ్యులు పదవులు పొందవచ్చు కానీ మేం పదవులు పొంద వద్దా అని ప్రశ్నించారు. కెసిఆర్ మాకు ఉరితాళ్లు వేస్తే అవి మా ఆయిష్షు పెంచుతాయన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ఎలా పెడతారో కేసిఆర్ చెప్పాలన్నారు. ప్రజా ప్రతినిధులను ఆగౌరవపర్చేలా కెసిఆర్ వ్యవహరిస్తోన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.

English summary
Congress mla Muthyam Reddy put conditions to Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao on resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X