బోర్డు తిప్పేసిన మరో సాఫ్టువేర్ సంస్థ టాస్క్ ఇన్ఫర్మేటిక్స్

ఈ సంస్థకు సిఇవోనని చెప్పుకుంటున్న పునీత్, ఎండి షేక్ అలీషాలు సుమారు 250 మంది నిరుద్యోగుల నుండి రూ.కోటి వసూలు చేశారు. మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన ఉద్యోగులు షేక్ అలీషాను గదిలో నిర్బంధించి కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పునీత్, అలీషాపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సిఇవోను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications