వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక కోర్టుకు హాజరైన తమిళనాడు సిఎం జయలలిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalitha
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం కర్ణాటక కోర్టులో హాజరయ్యారు. రూ. 66 కోట్ల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూర్‌లోని ప్రత్యేక కోర్టుకు ఆమె హాజరు కావడం ఇది మూడోసారి. ఆమె ప్రత్యేక న్యాయమూర్తి బిఎం మల్లికార్జునయ్య ముందు హాజరయ్యారు. ఆమె రాక సందర్భంగా కోర్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇంతకు ఆమె అక్టోబర్ 20, 21 తేదీల్లో కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె 570 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆమెను ప్రశ్నించడానికి మొత్తం 1,200 ప్రశ్నలను సిద్ధం చేశారు. ఈ కేసు గత పదిహేనేళ్లుగా నడుస్తోంది. పూర్తి ప్రశ్నలకు సమయం సరిపోకపోవడంతో కేసు విచారణను న్యాయమూర్తి అక్టోబర్ 21వ తేదీన నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసారు.

అయితే, తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. జయలలిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఒకటి, రెండు రోజుల్లో జయలలిత వాంగ్మూలాన్ని పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది.

English summary
Tamil Nadu chief minister Jayalalitha on Tuesday appeared before a special court here for the third time in the Rs 66-crore disproportionate assets case against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X