హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యూష కేసు: కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష కేసులో దోషి సిద్ధార్థ రెడ్డి బుధవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 202 ఫిబ్రవరిలో ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసులో ప్రత్యూష ప్రేమికుడిగా చెప్పే సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. దానిపై సిద్ధార్థ రెడ్డి

Prathyusha
హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన ఆరేళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సిద్ధార్థ రెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడు. శిక్షను మరింత తగ్గించాలని కోరుతూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడు.

సిద్ధార్థ రెడ్డి కోర్టుకు 50 వేల రూపాయల జరిమానాను చెల్లించారు. సిద్ధార్థ రెడ్డిని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్ డ్రింకులో విషం కలుపుకుని సేవించారని, దాని వల్ల ప్రత్యూష మరణించిందని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు సిద్ధార్థ రెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. హైకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పంధించారు. హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ప్రత్యూష మృతి వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని సరోజినీ చెప్పారు. తమకు హైకోర్టులో న్యాయం జరగలేదని ఆమె అన్నారు. మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. తన కూతురుని చంపినవారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడని అన్నారు.

English summary
Culprit in actress Prathyusha's death case, Sidhartha Reddy surrendered before Nampally Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X