ముంబై పేలుళ్ల కేసులో పురోగతి, ఇద్దరి అరెస్టు

బీహార్‌లోని దేవరా భంగోళి గ్రామానికి చెందిన 22 ఏళ్ల నఖీ అహ్మద్‌ను, 23 ఏళ్ల నదీం అక్తర్‌ను అరెస్టు చేసినట్లు ఎటిఎస్ చీఫ్ రాకేషన్ మారియా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. హరోన్ యాసిన్ నాయక్ అనే వ్యక్తికి పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే పేలుళ్లకు ఆర్థిక సాయం అందించాడని ఆయన చెప్పారు. పేలుళ్లకు వాడిన స్కూటర్లను నఖీ, అక్కర్ దొంగిలించినట్లు ఆయన తెలిపారు.
జులై 13వ తేదీన జరిగన పేలుళ్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. యాసిన్ భక్తల్ నఖీ అహ్మద్‌కు 1.5 లక్షల రూపాయలు ఇచ్చాడని ఆయన తెప్పారు. భక్తల్ ఢిల్లీలో పేలుడు పదార్థాలు, డెటొనేటర్లు అందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications