కిరణ్‌కు షాక్: ఎమ్మెల్యే సత్యవతి అలక, రిజైన్ యోచన

మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారు కానీ బిసిలకు చేయరా అని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పార్టీ పైనా, ముఖ్యమంత్రి పైన కోపం లేదని, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగక పోవడం పైనే అసంతృప్తి ఉందన్నారు. మంత్రులకు కేటాయించే శాఖలపై తాను ఏం మాట్లాడనన్నారు. నేను ఎప్పుడూ ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. కాగా గతంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సత్యవతి కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆముదాలవలస నుండి ఆమె రెండుసార్లు గెలుపొందారు. కాగా ఆమెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి సరైన న్యాయం చేస్తానని, రాజీనామా చేయవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications