సిఎం చెప్పారు, కానీ తప్పుకోను!:మ.నగర్‌పై విజయలక్మి

కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగింపులతో దివంగత రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఉప ఎన్నికల బరిలో నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారని, టిక్కెట్ కేటాయించనప్పటికీ పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని ఆమెకు హామీ సిఎం ఇచ్చారు. ఆయన హామీ కారణంగానే విజయలక్ష్మి పోటీ నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ముత్యాల ప్రకాశ్‌కు మద్దతిచ్చేందుకు ఆమె అంగీకరించారు. మహబూబ్ నగర్ సంక్షోభం చల్లారడంతో కాంగ్రెసు పార్టీ ఇక ఉప ఎన్నికల గెలుపుపై దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications