వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభకు మధ్యంతర ఎన్నికలు?, తెర తీసిన ద్వివేది

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చుననే విషయంపై చర్చ సాగుతోంది. యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు సీనియర్ నేత, రైల్వే మంత్రి ఆ చర్చకు తెర తీశారు. లోకసభకు గడువు లోగానే ఎన్నికలు జరగవచ్చునని ఆయన బుధవారం అన్నారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని, తన విశ్లేషణకు అనుగుణంగా తాను ఆ విధంగా చెప్పానని ఆయన గురువారం చెప్పారు. అయితే తమ పార్టీ యుపిఎ పడవను దిగబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని బలపరుస్తామని ఆయన చెప్పారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చేసిన వ్యాఖ్యపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అది తన వ్యక్తిగత విశ్లేషణ అని ఆయన చెప్పారు.

తమ పార్టీ యుపిఎతోనే ఉన్నదని ఆయన చెప్పారు. అయితే, తన వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యను ఆయన వెనక్కి తీసుకోలేదు. కొంచెం ఆలస్యంగానో ముందుగానో లోకసభకు ఎన్నికలు వస్తాయని ఆయన బుధవారంనాడు అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వార్తలను కాంగ్రెసు నేత, కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్ కొట్టిపారేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుందని ఆమె గురువారం అన్నారు మిత్రపక్షాలతో తమకు మంచి సంబంధాలున్నాయని ఆమె చెప్పారు.

English summary
Senior Trinamool Congress member Dinesh Trivedi says his party will not rock the UPA boat, and continue to support the government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X