వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి సారయ్య కొడుకు అరెస్టుకు రంగం సిద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sriman
వరంగల్: రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య కుమారుడు శ్రీమాన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హన్మకొండలోని మట్టెవాడలో ఎస్సై రమేష్‌ను దుర్భాషలాడినందుకు ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆదివారంనాడు మంత్రి సారయ్యకు వ్యతిరేకంగా కంత మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారు సారయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత సారయ్య కుమారుడు శ్రీమాన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వీరంగం సృష్టించారు. ఎస్సై రమేష్‌పై తిట్ల వర్షం కురిపించారు. దీంతో రమేష్ శ్రీమాన్‌పై రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీమాన్‌పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

మహీధర్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంతి బస్వరాజు సారయ్య కాన్వాయ్ కాజీపేటకు చేరుకున్న సమయంలో ఆదివారంనాడు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాజీపేట మేయిన్ రోడ్డులోని మినీ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందుకు చేరగానే పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ నేతృత్వంలో పలువురు తెరాస నాయకులు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డగించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కాన్వాయ్‌కు అడ్డంతిరుగుతున్న వారిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే వినయ్, టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలతో ముం దుకు దూసుకెళ్ళారు. కాగా, మంత్రి మహీధర్‌రెడ్డి తన వాహనం నుంచి కిందికి దిగాల్సి వచ్చింది.

కాజీపేటలో పేరుకుపోయిన సమస్యలను స్వయంగా పరిశీలించాలని ఎమ్మెల్యే వినయ్ మంత్రిని కోరారు. మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య అక్కడికి చేరుకుని పరిస్థితిని వినయ్‌తో మాట్లాడారు. సమస్యలను పరిశీలించాల్సిందేనని పట్టుబట్టడంతో మంత్రి మహీధర్‌రెడ్డి సానుకూలంగా స్పందించి మినీ మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్ళారు.

తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడుతున్నందు వల్లనే తనపై కుట్ర చేసి తన కుమారుడిని కేసుల్లో ఇరికించారని ఆయన ఆరోపిచారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు.

English summary
It is said that BC welfare minister Baswaraju Saraiah's son Sriman may be arrested for verbal assault against SI Ramesh. Sriman on sundaty went to PS and expressed unhapinees with the police for not taking action against Telanganites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X