• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

50పెళ్లిళ్ల షహనాజ్ ప్రేమ వలలో విఐపిలు? హైకోర్టులో..

By Srinivas
|

Shahnaz
చెన్నై: దాదాపు యాభై మందిని పెళ్లిళ్లు చేసుకొని వారిని మోసగించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షహనాజ్ లిస్టులో కేవలం ఉద్యోగులు, వ్యాపారస్తులే కాకుండా విఐపిలు సైతం ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షహనాజ్ ప్రేమ వలలో పలువురు అధికారులతో పాటు సిని రంగానికి చెందిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. ఆయితే ఆమె ఆచూకీ దొరికితే గానీ ఎవరెవరు ఆమె ట్రాప్‌లో పడిపోయారనే విషయంలో పోలీసులకు ఓ క్లారిటీ వస్తుంది. మణికంఠ అనే యువకుడిని తాను మద్రాసు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి బోల్తా కొట్టించింది.

కాగా దాదాపు యాభై మందిని పెళ్లిళ్లు చేసుకొని వారిని షహనాజ్ మోసగించిన విషయం తెలిసిందే. ఈమె మోసం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆమె మోసం గ్రహించిన యువకులు చెన్నై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసులు ఫోన్‌లో మాట్లాడినప్పుడు షహనాజ్‌కు కోపమొచ్చిన విషయం తెలిసిందే. ఓ మహిళ యాభై మందిని ప్రేమించి పెళ్లాడగలదా, నా పరువును తీశారు, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేశంతో ఊగిపోయింది. తనని ఓ యువతి మోసం చేసిందని పేర్కొంటూ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు ఒకే రోజున నాలుగురోజుల క్రితం నగర కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో కేరళ కిలాడీ లేడి గుట్టు బట్టబయలైంది.

పోలీసులు పత్రికలో ప్రచురించిన ఆ యువతి ఫోటోను చూసి పలువురు యువకులు కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడంతో పాటు ఆమె తమనూ మోసం చేసినట్లు పోలీసులకు తెలిపారు. యాభై మంది వరకు యువకులతో ప్రేమాటలాడి భారీ మొత్తంతో ఉడాయించిన కేరళ లేడీ నేపథ్యంపై పోలీసులు చెప్పిన వివరాల... కేరళ రాష్ట్రం కేశవపురానికి చెందిన షహనాజ్ గత పదకొండేళ్ల క్రితం సిద్ధిక్ అనే కేరళ యువకుడిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ సంతానం కూడా కలిగింది. తరచూ భర్తతో విభేదిస్తూ అతనికి దూరమైన షహనాజ్ అక్కడే తన ప్రేమ నాటకానికి తెరదీసింది. తొలుత కేరళకు చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం జరిపిన సహానా అతనిని వదిలేసి చెన్నయ్ రైలేక్కెసింది.

2006 సంవత్సరంలో మద్రాసు నగరంలోకి అడుగుపెట్టిన సహానా శ్రీపెరంబదూరు సమీపంలో నివాసముంటూ ఆ ప్రాంతానికి చెందిన మణికంఠ న్అనే వ్యక్తిని కల్లబొల్లి మాటలతో తన వలలో వేసుకుంది. అతన్ని రహస్య వివాహం చేసుకున్న సహానా ఐఏఎస్ ప్రిపరేషన్ పేరుతో సైదాపేటలోకి మకాం మార్చింది. అప్పటి నుంచి కనిపించిన యువకులపై ప్రేమ వల విసరడం అందినకాడికి దక్కించుకోవడం ఆపై తన దారి తాను చూసుకుంటూ పలు మోసాలకు పాల్పడింది.

ఈ క్రమంలో పలువురు యువకులను పెళ్లాడి వారం, పదిరోజుల పాటు కాపురం కూడా చేసింది. ప్రస్తుతం ఎవ్వరితోనూ లేకుండా ఒంటరిగా వుంటున్న షహనాజ్ ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆమె గుట్టు రట్టు కావడం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌లలో పోలీసులు సంప్రదించినప్పుడు పలు మార్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో షహనాజ్ ఫోన్‌లో పోలీసులకు దొరికింది.

ఆమెతో మాటలు కలిపిన పోలీసులు వివరాలు ఆరా తీయగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్క మహిళ యాభై మందిని ప్రేమించి పెళ్లి చేసుకోగలదా? అర్ధం పర్థం లేకుండా నిందలు మోపుతారా? అంటూ పోలీసులనే నిలదీసినంత పని చేసింది. నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఇదంతా చేస్తున్నారు. ఇక తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఫోన్‌ను కట్ చేసింది. కాగా షహనాజ్ యాభై మంది వరకు కాక పోయినా పదిహేను మందికి పైగా పెళ్లి చేసుకొని మోసగించి ఉండవచ్చునని తెలుస్తోంది.

English summary
A woman who could have married as many as 50 men in order to allegedly con them out of their cash is being hunted by police. The serial love cheat, who is believed to be aged 33 and called Shahanaz, has allegedly spent the last decade wooing potential husbands before legging it with their money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X