చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూర్‌లో యాభై పెళ్లిళ్ల లేడీ కిలాడీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahnaz
బెంగళూర్: యాభై మంది యువకులను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిన లేడీ కిలాడీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గత కొద్ది రోజులుగా ఆమె పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది. ఎవరితోనూ పట్టుమని వారం రోజులు కూడా కాపురం చేయకుండా బంగారు నగలు, నగదుతో ఉడాయిస్తూ వస్తోంది. ముప్పై ఏళ్ల ఆ మహిళను చెన్నై పోలీసులు శనివారం రాత్రి బెంగళూర్‌లోని మెజిస్టిక్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఊన్నట్లు సమాచారం అందుకుని అరెస్టు చేశారు.

స్థానిక పోలీసుల సహాయంతో ఆమెను చెన్నైని తీసుకుని వెళ్లారు. కేరళకు చెందిన షహనాజ్ మొదట ఓ వికలాంగుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం చిరువ్యాపారిని వివాహమాడి అతడి వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారు నగలు, లక్ష రూపాయల నగదు తీసుకుని చెన్నైకి మకాం మార్చింది. చెన్నైకి వచ్చి శ్రీమంతుల బిడ్డలాగా, ఆధునిక యువతి తరహాలో ముస్తాబై ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వారి వద్ద నగదు, నగలు తీసుకుని పరారయ్యేది.

రెండు వారాల క్రితం చెన్నై నివాసి శరవణ అనే యువకుడు టీ. నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె గుట్టు రట్టయింది. ఆరు నెలల క్రితం శవరణను ఓ దేవస్థానంలో ఆమె రాధిక పేరుతో పెళ్లి చేసుకుంది. రెండు రోజుల పాటు కాపురం చేసి నగదు, నగలు తీసుకుని మాయమైంది. ఫోన్ చేస్తే మొబైల్ స్విచాఫ్ చేసి ఉంది. దాంతో తాను మోసపోయానని గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఫొటోను పత్రికల్లో ప్రచురించారు.

ఆ ఫొటో చూసిన చాలా మంది వ్యక్తులు పోలీసు స్టేషన్‌కు వచ్చి తన భార్యగా చెప్పుకున్నారు మోసపోయామని గ్రహించారు. పత్రికల్లో తన ఫొటో వచ్చిన విషయాన్ని తెలుసుకున్న షహనాజ్ తిరుపతి, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సేలం, హోసూరుల్లో కొద్ది రోజులు గడిపింది. అక్కడి నుంచి బెంగళూర్‌కు మకాం మార్చింది. ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించి ఆమెను పట్టుకున్నారు.

English summary
Chennai police have arrested Shahanaz in Bangalore. police are hunting from few days for Shahanaz who was cheated above 50 men with the name of love and marriage. changing villages to escape from police, at last reached to Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X