వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైరవీలతోనే నంది అవార్డులు: మోహన్ బాబు వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

Mohan babu
తిరుపతి: ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరవీలు చేసుకుంటూనే నంది అవార్డులు వస్తాయని ఆయన అన్నారు. దేశ గర్వించదగిగిన మహా నటుడు ఎన్టీ రామారావుకు నంది అవార్డు దక్కలేదని, తనకు కూడా నంది అవార్డు రాలేదని ఆయన అన్నారు.

నంది అవార్డుల వెనుక రాజకీయాలు దాగి ఉన్నాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత హిందీ రచయిత మునిసుందరం రచించిన 'ఒక యుద్ధం తరువాత' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోహన్‌బాబు సినీ నంది అవార్డుల ఎంపిక తీరుపై విరుచుకుపడ్డారు.

రాజకీయాల వల్లే తనకూ నంది అవార్డు లభించలేదన్నారు. నంది అవార్డులు వెనుక రాజకీయం ఉన్నందున ప్రతిభకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. నంది అవార్డులు రావాలంటే వెనక వేరే కారణాలు ఉండాలని ఆయన అన్నారు.

ఎస్.మునిసుందరం తాను రాసిన ఒక యుద్ధం తరువాత గ్రంథాన్ని తనకు అంకితం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి ప్రస్తావన రావడంతో మోహన్‌బాబు ఆసంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా నంది అవార్డులను ప్రదానం చేస్తుంది.

English summary
Eminent actor Moahan babu has made sensational comments on state sponsered Nandi awards. He said that politics are involved in presenting Nandi awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X