వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి వర్గ విస్తరణ: బాల్ థాకరే నోట జగన్, చిరంజీవి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bal Thackeray
ముంబయి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకే మన్మోహన్ సింగ్ మంత్రి మండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద పీట వేశారని శివసేన అధినేత బాల్ థాకరే అన్నారు. సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో ఆయన తన సంపాదకీయంలో కేంద్రమంత్రివర్గ విస్తరణపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద పీట వేయడంపై అన్ని పత్రికలు జగన్, తెలంగాణ అంశాలే కారణమని రాశాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి మండలిలో ఏపికి ప్రాధాన్యత ఇచ్చారని పలు పత్రికలు పేర్కొన్నాయి. తన పత్రిక సామ్నాలో బాల్ థాకరే.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందు వల్లనే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.

అయితే ఈ అంశాలు జగన్ పైన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపుకు చెందిన లోక్ సత్తా దినపత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడైన జగన్‌ కొద్దీ కాలం తర్వాత కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని తెలిపింది.

ఆయనపై ప్రస్తుతం దర్యాఫ్తులు జరుగుతున్నాయని, ఆస్తుల కేసులో జైలులో ఉన్నారని తెలిపింది. తెలంగాణ అంశం కూడా కాంగ్రెసు ఎటూ తేల్చలేక పోయిందని పేర్కొంది. జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎపికి పెద్ద పీట వేసిందని లోక్ సత్తా పత్రిక పేర్కొంది.

English summary
Shiv Sena chief Bal Thackeray wrote in his party paper Samna that Congress party gave priority to Andhra Pradesh due to Telangana and Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X