హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిక్చర్స్: వైయస్ జగన్ పార్టీ క్రౌడ్ పుల్లర్స్ వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీకీ లేనంత మంది క్రౌడ్ పుల్లర్స్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పోటీ ఇస్తుంది. సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి క్రౌడ్ పుల్లర్స్ తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి క్రౌడ్ పుల్లర్స్‌గానే కనిపిస్తున్నారు.

పిక్చర్స్: జగన్ పార్టీ క్రౌడ్ పుల్లర్స్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలుకు వెళ్లడానికి ముందు పెద్దయెత్తునే ప్రజలను ఆకర్షించారు. ఆయన అడుగు బయటపెడితే అదో వార్త అయ్యే పరిస్థితి. ఆయన ఓదార్పు యాత్ర, దీక్షలతో నిరంతరం ప్రజలను కూడగట్టే పనిలో మునిగిపోతూ వచ్చారు.

పిక్చర్స్: జగన్ పార్టీ క్రౌడ్ పుల్లర్స్

వైయస్ జగన్ జైలుకు వెళ్లడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయన తల్లి, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఆమె ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి తీసుకునే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో జరిగే సభల్లో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పిక్చర్స్: జగన్ పార్టీ క్రౌడ్ పుల్లర్స్

వైయస్ జగన్ జైలుకు వెళ్లిన తర్వాత సహజ నాయకురాలిగా ప్రజల్లోకి ఆయన సోదరి షర్మిల బయటి ప్రపంచంలో కాలు పెట్టారు. తల్లితో పాటు ప్రారంభమైన ఆమె ప్రజా యాత్రలు పాదయాత్ర దాకా సాగాయి. ప్రజలను పార్టీ వైపు ఆకర్షించే పనిలో ఆమె పాదయాత్రను ప్రధాన కార్యాచరణగా ఎంచుకున్నారు.

పిక్చర్స్: జగన్ పార్టీ క్రౌడ్ పుల్లర్స్

వైయస్ జగన్ భార్య భారతి తమ కంపెనీల వ్యవహారాలు, న్యాయపరమైన వ్యవహారాలను చూడడంలో మునిగిపోయారు. ప్రజల్లోకి రావడానికి తగిన వెసులుబాటు ఆమెకు లభిస్తున్నట్లు లేదు. ఎన్నికల నాటికి ఆమె కూడా ప్రజల్లోకి రావచ్చు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో క్రౌడ్ పుల్లర్ ఆయాచితంగానే లభించవచ్చు.

పార్టీ అధ్యక్షు వైయస్ జగన్‌తో పాటు తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల కూడా ప్రజలను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. వైయస్ జగన్ సతీమణి భారతి ప్రజల మధ్యకు రావడం లేదు గానీ ఆమె కూడా వస్తే ఆ పార్టీకి క్రౌడ్ పుల్లర్స్ కొరత ఏ మాత్రం ఉండదనే అంటున్నారు. అయితే, ఈ ఆకర్షణ ఎన్నాళ్లు ఉంటుందనేది మాత్రం చెప్పలేం. వచ్చే ఎన్నికల వరకు ఈ ఆకర్షణ శక్తిని వారు కాపాడుకోవాల్సి ఉంటుంది.

English summary
YSR Congress party has more crowd pullers in Andhra Pradesh politics. YS Jagan, along with YS Vijayamma and Sharmila are attracting people in big way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X