హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐడికి భంగపాటు: విచారణకు సహకరించని శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావుకు సిఐడి విచారణకు సహకరించడం లేదట. గత గురువారం శంకరరావు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి అదనపు డిజి కృష్ణ ప్రసాద ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. శంకరరావును విచారించేందుకు కృష్ణ ప్రసాద్ మంగళవారం కేర్ ఆసుపత్రికి వెళ్లారు.

కానీ, ఆయనకు శంకరరావు నుండి సహకారం లభించలేదు. శంకరరావు విచారణకు సహకరించడం లేదని డిజి కృష్ణ ప్రసాద్ తెలిపారు. విచారణ కోసం తాను గతంలో రెండుసార్లు స్వయంగా వెళ్లి కలిశానని ఆయన చెప్పారు. ఆయన మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ కేసుకు సంబంధించిన శంకరరావును విచారించిన అనంతరం తాము నేరెడ్‌మెట్ పోలీసులను విచారిస్తామని చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి శంకరరావును విచారించేందుకు సిఐడి బృందం ఇప్పటికే రెండుసార్లు కేర్ ఆసుపత్రికి వెళ్లింది. కానీ ఆయన సహకరించలేదు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయన సహకరించలేదని సిఐడి చెబుతోంది. శంకరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సిఐడి బృందంతో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు.

కాగా గత గురువారం గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకున్న తీరును అందరూ ఖండించారు. అయితే, తాము విచారించేందుకే శంకరరావు ఇంటికి వెళ్లామని, స్టేషన్‌కు రమ్మంటే ఆయనే లుంగీ పైన వస్తానని చెప్పారని, తాము ఆయన పట్ల దురుసుగా వ్యవహరించలేదని పోలీసులు చెప్పారు. దీనిపై సిఐడి విచారణ జరుపుతోంది.

English summary
CID DG Krishna Prasad said on Tuesday that former Minister Shankar Rao is not co operating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X