హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

6 స్థానాలకు 83 మంది: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanwar Lal
హైదరాబాద్: శాసనమండలి ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నేడు ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 14 జిల్లాల్లో ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1437 పోలింగ్ కేంద్రాల్లో 6.32 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

14 జిల్లాల పరిధిలో మూడింటి చొప్పున పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లకు సర్కారు ప్రత్యేక సెలవు మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నవారు కొంత ఆలస్యంగా వచ్చినా, సెలవు కోరినా అనుమతించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

6లక్షల 32 వేల 122 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1437 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది మినహా మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంతో అనుసంధానించారు. ఓటర్లకు ఎన్నికల కమిషన్ నిర్ధిష్టమైన సూచనలు చేసింది. పోలింగ్ బూత్‌లో ఇచ్చే ఊదా రంగు స్కెచ్ పెన్నుని మాత్రమే ఓటర్లు ఉపయోగించాలి.

అభ్యర్ధులకు ఎదురుగా ఉన్న బాక్స్‌లో తమ ప్రాధాన్యతని అంకెల రూపంలో ఒకే భాషలో పేర్కొనాలి. అంకెలను రాతపూర్వకంగా రాసినా, వేలి ముద్రలు వేసినా, పేర్లు రాసినా, ఏమైనా కోడ్‌లు వేసినా ఆ ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు ఫోటోతో ఉన్న 15 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటు వేయవచ్చు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆ రుగురు ఐఎఎస్ అధికారులను ఈసి నియమించింది. ప్రత్యేక పోలీసు బలగాలు, మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు.

పట్టభద్రుల నియోజక వర్గాలు: 1.తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి 2.కృష్ణా-గుంటూరు 3.మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్
ఉపాధ్యాయ నియోజక వర్గాలు: 1.శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్టణం 2.ఖమ్మం-వరంగల్-నల్గొండ 3.మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్

English summary

 MLC Elections starts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X