హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహ్మద్‌ఆదాం..అడ్రస్ అదే కానీ: నకిలీ చిరునామా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad held at Nepal border
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరిని నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాదుకు చెందిన మహ్మద్ ఆదాం మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి సోమాలియాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఓమన్‌గా గుర్తించారు. ఆదాం హైదరాబాదులోని మొహిదీపట్నంలోని ఓ చిరునామాతో అతడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు.

మహ్మద్ ఆదాం పేరుతో రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లుగా ఉంది. అయితే, డ్రైవింగ్ లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామా సరైనదే అయినప్పటికీ ఆ ఇంటిలో ఆ పేరుతో ఎవరు లేరట. మరోవైపు డ్రైవింగ్ లైసెన్స్‌లో పేర్కొన్న ఓ చిరునామాలో ఉన్న ఇంటిలో కొన్నాళ్ల పాటు సోమాలియాకు చెందిన ఓ కుటుంబం ఉండేదని తేలినట్లుగా తెలుస్తోంది.

ఏడాది క్రితం వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సరిహద్దుల్లో పోలీసులకు చిక్కిన సోమాలియా వాసి నుంచి స్వాధీనం చేసుకున్న నేపాల్ గుర్తింపు కార్డులో అహ్మద్ అవిల్ అబ్దులై పేరుండగా, భద్రతా దళాలకు మాత్రం తన పేరును అతడు అబ్దుల్లా ఓమర్ మక్రాన్ అని చెప్పాడు. అయితే, దొరికిన సోమాలియా వాసి ఈ ఇంటిలో లేనట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, ఆదాం తప్పుడు చిరునామా ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

English summary

 Two men, one of Somali origin and the other claiming to be a resident of Hyderabad, were detained by Intelligence and police officials when they were trying to walk across the border into Nepal near Bihar’s Raxaul on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X