ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ వైపు రమేశ్ రాథొడ్ చూపు..? హస్తం వీడి కమలదళంలో చేరే ఛాన్స్...?

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ మార్పు అంశానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అనుచరులు, అభిమానులతో మాట్లాడుతున్నారు. చివరకు బీజేపీలో చేరాలని రమేష్ రాథోడ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్ అని అందరూ భావిస్తోండగా.. కాంగ్రెస్ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రమేశ్ రాథొడ్. వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో ఆయన ఉన్నారు. 1999 - 2004 మధ్యకాలంలో ఎమ్మల్యేగా విజయం సాధించారు. 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా రమేశ్ రాథొడ్ పనిచేశారు. 2009లో 15వ లోక్ సభకు పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు.

congress leader ramesh rathod likely join bjp

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముందే.. రమేష్ రాథోడ్‌ను పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికలో పావులు కదపాలని బీజేపీ భావిస్తోంది. లంబాడి, ఆదివాసీలకు దగ్గర వ్యక్తి కావడంతో రమేష్ రాథోడ్ చేరికను ఆ పార్టీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. రమేష్ రాథోడ్‌తోపాటు పాల్వాయి హరీష్ కూడా బీజేపీ ఆకర్ష్ మంత్రంలో భాగాంగా కమలం గూటికి చేరే అవకాశం ఉంది. లంబాడి వర్గానికి చెందిన రమేష్ రాథోడ్.. సిర్పూర్ కాగజ్ నగర్‌లో బలంగా ఉన్న పాల్వాయి హరీష్ తమ పార్టీలో చేరితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరింత బలపడవచ్చునని బీజేపీ భావిస్తోంది.

English summary
congress leader ramesh rathod likely join bharatiya janata party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X