పెళ్ళై నాలుగు నెలలే, పెళ్లి కూతురు మృతి, కారణమదేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

గూడూరు: పెళ్ళై నాలుగు మాసాలే. కాని, కొత్త పెళ్ళి కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తమ కూతురు మరణానికి అత్తింటివారే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అత్తింటివారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంల నార్తురాజుపాలెం గ్రామానికి చెందిన అమరావతి,శ్రీనివాసులు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అయితే శ్రీనివాసులు కొంత కాలం క్రితం చనిపోయాడు. శ్రీనివాస్ పెద్ద కుమార్తె సౌమ్య అలియాస్ వర్షితను కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన కృష్ణ అలియాస్ వెంకటకృష్ణకు ఇచ్చి గత ఏడాది డిసెంబర్ 4వ, తేదిన వివాహం చేశారు.

a lady died in nellore district

పెళ్ళి సమయంలోనే భారీగా కట్నకానుకలు సమర్పించారు.కొత్త దంపతులు గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో కాపురం ఉంటున్నారు.అయితే కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది.కాని, అదనపు కట్నం తేవాలంటూ సౌమ్యను అత్తింటివారు వేధించారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ వవిషయమై పుట్టింటికి వెళ్ళిన సౌమ్య నాలుగు రోజుల క్రితమే అత్తింటికి వచ్చింది.అయితే భార్య, భర్లల మద్య ఏం జరిగిందో తెలియదు. గురువారం ఉదయం ఆమె చనిపోయిందని సౌమ్య కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు అత్తింటివారు.

అయితే తమ కూతురును హత్య చేసి ఆత్మహత్య చేసుకొందని కట్టుకథలు అల్లుతున్నారని సౌమ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సౌమ్య భర్త వెంకటకృష్ణను, తల్లి బుజ్జమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a lady died in nellore district on thursday. venkata krishna married sowya on dec4,2016, venkata krishna and other family members harassed sowmya for extra dowry.sowmya died on thursday.
Please Wait while comments are loading...