వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామేశ్వరంకు చంద్రబాబు: అనంతలో కలాం నాటిన మొక్క (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: రామేశ్వరంలో జరగనున్న అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారని తెలుస్తోంది. కలాంతో ఆయనకు అనుబంధం ఉంది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోమవారం నాడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రామేశ్వరంలో బుధవారం మధ్యాహ్నం జరగనున్నాయి.

కాగా, అబ్దుల్ కలాం పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. చంద్రబాబు నాయుడుతో కలిసి అనంతపురం జిల్లాలో అగ్రికల్చరల్ మిషన్ ప్రారంభించారు.

కలాంతో కలిసి వస్తూ చంద్రబాబు

కలాంతో కలిసి వస్తూ చంద్రబాబు

అబ్దుల్ కలాం పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. చంద్రబాబు నాయుడుతో కలిసి అనంతపురం జిల్లాలో అగ్రికల్చరల్ మిషన్ ప్రారంభించారు.

చంద్రబాబు, కలాం

చంద్రబాబు, కలాం

గత ఏడాది అక్టోబర్ నెలలో వ్యవసాయ శాఖ మిషన్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అబ్దుల్ కలాం హాజరయ్యారు.

చంద్రబాబు, కలాం

చంద్రబాబు, కలాం

దీనిని స్థానిక ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. కలాం కళ్యాణదుర్గం రావడం ఓ వరం అయితే, తాను ఆయన పక్కనే కూర్చోవడం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.

చంద్రబాబు, కలాం

చంద్రబాబు, కలాం

ఆయన మృతి చెందిన విషయం తెలియగానే ఆవేదనకు లోనయ్యానని చెప్పారు. కలాంతో తన మనవరాలు కరచాలనం చేసేందుకు వచ్చిందని, ఆయన నిలబడి చేయి అందించారని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు, కలాం

చంద్రబాబు, కలాం

వేదిక వద్ద ఆయన నాటిని మొక్క ఎంతో చక్కగా పెరుగుతోందని, దేశమే గర్వించదగ్గ మేధావి లేడనే విషయం జీర్ణించుకోలేపోతున్నట్లు చెప్పారు.

చంద్రబాబు, కలాం

చంద్రబాబు, కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గత ఏడాది అనంతపురం జిల్లా వచ్చారు. వ్యవసాయ శాఖ మిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొని పండ్లు, కూరగాయలు పరశీలిస్తూ...

అబ్దుల్ కలాం నాటిన మొక్క

అబ్దుల్ కలాం నాటిన మొక్క

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యవసాయ శాఖ మిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఓ మొక్క నాటారు. అది బాగా పెరుగుతోంది.

English summary
Former President APJ Abdul Kalam visited Anantapur district last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X