ఛలో విజయవాడ సక్సెస్-ఆత్మరక్షణలో జగన్ సర్కార్-ఎల్లుండి సమ్మెను అడ్డుకునేదెలా?
ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ పోరులో భాగంగా చేపట్టిన ఛలో విజయవాడ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొదట్లో ఆంక్షలు పెట్టి ఆ తర్వాత పరిస్ధితిని గమినించి ఉద్యోగుల్ని విజయవాడలోకి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎల్లండి నుంచి ఉద్యోగులు ప్రారంభించబోతున్న సమ్మె విషయంలోనూ వ్యూహం లేనట్లుగానే కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వంలోనే భాగమంటూనే, చర్చలకు రావాలంటూనే, మరోవైపు హెచ్చరికలు చేస్తుండటంతో ఈ పోరు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది.
Recommended Video

ఛలో విజయవాడ సక్సెస్
ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై రగిలిపోతున్న ఉద్యోగులు... 15 రోజుల క్రితమే ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఆ మధ్యలోనే ప్రభుత్వం, ఉద్యోగుల చర్చలతో పరిస్ధితి అంతవరకూ రాదని అంతా భావించారు. కానీ ఉద్యోగులు కోరుతున్న ఏ ఒక్క అంశంపైనా ప్రభుత్వం వెనక్కి తగ్గేందుకు సిద్ధపడలేదు. దీంతో ఛలో విజయవాడ నిర్వహించక తప్పని పరిస్ధితి వచ్చేసింది.
చివరి నిమిషంలో ప్రభుత్వం తనదైన శైలిలో ఆంక్షలు పెట్టేందుకు విఫలయత్నం చేసింది. దీంతో ఉద్యోగులు రకరకాల వేషాల్లో బెజవాడకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డును నింపేశారు. ఒక్క అవాంఛనీయ ఘటన కూడా లేకుండానే ఉద్యోగులు తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

ఆత్మరక్షణలో సర్కార్
ఉద్యోగుల ఛలో విజయవాడ ను అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకూ ఆరెస్టులు, నిర్బంధాల్ని ప్రయోగించిన ప్రభుత్వం.. అప్పటికే నగరానికి ఉద్యోగులు భారీ ఎత్తున చేరుకున్నారన్న సమాచారంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ దశలో ఉద్యోగుల్ని అడ్డుకుని చెడ్డపేరు తెచ్చుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదన్న పరిస్ధితుల్లోకి వెళ్లిపోయింది.
దీంతో ఉద్యోగుల్ని బీఆర్టీఎస్ రోడ్డులోకి వదిలేయాలనే ఆదేశాలు వచ్చేశాయి. దీంతో పోలీసులు కూడా వారిని బీఆర్టీఎస్ రోడ్డులోకి అనుమతించేశారు. దీంతో కేవలం గంట వ్యవధిలోనే పరిస్ధితి మొత్తం మారిపోయింది. మరో రెండు గంటల్లో ఉద్యోగ నేతలు ఛలో విజయవాడ సక్సెస్ అయిందని ప్రకటించడంతో ప్రభుత్వం వద్ద మాటల్లేకుండా పోయాయి.

ఆచితూచి స్పందించిన మంత్రులు
ఛలో నిజయవాడ సక్సెస్ అయిందని ఉద్యోగులు ప్రకటించగానే.. రంగంలోకి దిగిన మంత్రులు నష్టనివారణ ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఛలో విజయవాడ గురించి ఎక్కువగా ప్రస్తావించకుండానే ఉద్యోగులు చర్చలకు రావాలని, ప్రభుత్వానికి సహకరించాలని, వారంతా ప్రభుత్వంలో భాగమని, ఇప్పటికే వారికి ఈ ప్రభుత్వం చాలా చేసిందంటూ మంత్రులు ఎవరికి తోచిన శైలిలో వారు వ్యాఖ్యానాలు చేశారు. చివరికి మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తన పాత శైలిలోనే వారికి హెచ్చరికలు చేశారు.

సమ్మెను అడ్డుకునేదెలా?
ఛలో విజయవాడ కార్యక్రమం అంచనాలకు మించి సక్సెస్ కావడంతో ఇప్పుడు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎల్లుండి నుంచి సమ్మెలోకి వెళ్లడం ఖాయమని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. వెళ్లే ముందు ఓసారి మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
గతంలో పలుమార్లు ప్రభుత్వంలో వివిధ రూపాల్లో చర్చలు జరిపినా ఒక్క డిమాండ్ ను కూడా సాధించుకోలేకపోయిన ఉద్యోగ నేతలు.... ఇవాళ ప్రభుత్వం కోరిన విధంగా మరోసారి చర్చలకు వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను ఆపేందుకు ఉద్యోగులను ఎలా ఒప్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.
కానీ వారి డిమాండ్లను మాత్రం వినేందుకు సిద్ధంగా లేదు. దీంతో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. అయితే సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికీ నిర్దిష్ట వ్యూహం లేదు. కనీసం ప్రత్యామ్నాయాలపైనా దృష్టిసారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications