వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కినేని: వంద రూపాయలు ఇచ్చి పంపించేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతకన్నా ఎక్కువగా సినీనటుడిగా పేరుతెచ్చుకున్నారు. 1940లోవచ్చిన 'ధర్మపత్ని' ఆయన మొదటి సినిమాగా చెప్పుకుంటారు. అయితే, ఆ సినిమా కన్నా ముందు అక్కినేనికి మరో అవకాశం వచ్చింది.

'తల్లిప్రేమ' అనే సినిమాలో ఆయనకు మొదటి అవకాశం వచ్చింది. జ్యోతి సిన్హా దర్శకుడు. కథ రీత్యా అందులో ఓ 14యేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. దానికి అక్కినేనిని ఎంపిక చేసి మద్రాసు తీసుకెళ్లారు. ఆ సినిమాకు నిర్మాత కడారు నాగభూషణం. షూటింగ్ జరుగుతోంది. కానీ ఆయన పాత్ర మాత్రం రావడం లేదు. అలా నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అక్కినేని.

Akkineni got chance before Dharma pathni

కానీ కథలో లెంగ్త్ పెరిగిపోవడంతో ఆ పాత్రను తీసేశామంటూ యూనిట్ సభ్యులు బాంబు పేల్చారు. వంద రూపాయలు అక్కినేని చేతిలో పెట్టి పంపించేశారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో 'ధర్మపత్ని' సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు.

అయితే అప్పటికే ఆయన వయసు 16 ఏళ్లు. దాంతో ఆ వేషానికి పెద్దవాడైపోయాడనే ఉద్దేశంతో అక్కినేనికి గుంపులో గోవింద లాంటి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా తొలిసారి తెరపై కనిపించారు. ఆ విధంగా చూసుకుంటే అక్కినేని తొలి సినిమా ధర్మపత్నే.

English summary
Akkineni Nageswar Rao not able act in Talli preama film as his rile had been delited. So, his first movie bacame Dharma Pathni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X