రాజకీయాల్లో చిరంజీవితో టఫ్ సిచ్యుయేషన్, నేను బాధ్యత తీసుకున్నా: అల్లు అరవింద్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవికి తనకు మధ్య ఎప్పుడు ఎలాంటి విభేదాలు లేవని, రాలేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయన ఓ టీవీ పత్రికా ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో భాగంగా చిరంజీవితో సంబంధాలపై కూడా స్పందించారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, రాజకీయాల్లో ఉన్న సమయంలో తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న టఫ్ సిచ్యుయేషన్స్ వచ్చాయని ఆయన చెప్పారు. కానీ అవి ఏవీ కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపలేదని వెల్లడించారు.

రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)

కలిసే ముందుకు సాగుతున్నాం

కలిసే ముందుకు సాగుతున్నాం

చిరంజీవి, తాను అప్పుడు, ఇప్పుడు కూడా ఎప్పటిలా కలిసి ముందుకు సాగుతున్నామని అల్లు అరవింద్ చెప్పారు. కేవలం ఆయన రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు మాత్రమే చిన్న చిన్న కఠిన పరిస్థితులు వచ్చినా, వాటిని లెక్కలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు.

వారిలా మేమూ ముందుకు

వారిలా మేమూ ముందుకు


సినిమా పరిశ్రమలో దశాబ్దాలపాటు కలిసి కొనసాగిన వారిలో చిరంజీవి, తాను కూడా ఉన్నామని చెప్పారు. బాపు, రమణ, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిల వలె తాము కూడా ముందుకు సాగుతున్నామని అల్లు అరవింద్ వెల్లడించారు.

నేను బాధ్యత తీసుకున్నా, సినిమాలపై చిరంజీవి ఫోకస్

నేను బాధ్యత తీసుకున్నా, సినిమాలపై చిరంజీవి ఫోకస్

చిరంజీవి తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని అల్లు అరవింద్ చెప్పారు. దానిని తాను బాధ్యతగా తీసుకున్నానని చెప్పారు. తెర వెనుక చిన్న చిన్న బాధ్యతలను స్వీకరించానని, దాంతో చిరంజీవి సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టగలిగారని చెప్పారు.

రాజకీయాల్లో చిరంజీవి వెనుక అల్లు అరవింద్

రాజకీయాల్లో చిరంజీవి వెనుక అల్లు అరవింద్

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు అల్లు అరవింద్ కూడా కీలకంగా వ్యవహరించారు. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Producer Allu Aravind about Congress leader Chiranjeevi in interview.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి