ఆధార్ అనుసంధానం తప్పదు, లేకపోతే బ్యాంకు అకౌంట్ మూతపడుతుందన్న అధికారులు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: వివిధ పధకాలకు ఆధార్‌ కార్డ్ అనుసంధానం చెయ్యడంపై కేంద్రం మరోసారి వివిధ సంస్థలకు దిశానిర్దేశం చేసింది. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ మరియు మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ కార్ఢ్ అనుసంధానం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యడంతో జిల్లాలో ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు.

ఇప్పటికే ఆధార్‌ నంబర్ ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్నప్పటికీ మరోసారి బ్యాంకుకు వెళ్లి లింక్ చేయించుకోవాలని, అదేవిధంగా మొబైల్ కనెక్షన్ కు కూడా ఆధార్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఆధార్ పైన కేంద్రం ఆలోచన

ఆధార్ పైన కేంద్రం ఆలోచన

గతంలో ఆధార్ అనుసంధానం సమయంలో చోటు చేసుకున్న తప్పులు సరిదిద్దుకోవడానికి, సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో పాటు మరోసారి ఆధార్ ను లింక్ చెయ్యాల్సిన పరిస్థితి రాకుండా పకడ్బందీగా అమలు చెయ్యాలనేది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. దీనివల్ల పలు కార్యక్రమాల అమలులో అక్రమాలను నిరోధించవచ్చని కేంద్రం విశ్వసిస్తోంది.

 పథకాల అమలులో అక్రమాలు నిరోధించేందుకే

పథకాల అమలులో అక్రమాలు నిరోధించేందుకే

ఆధార్ అనుసంధానంపై కేంద్రం స్పష్టమైన వైఖరి కలిగి ఉండటంతో బ్యాంకులు తమ ఖాతాదారులకు, అలాగే మొబైల్ సర్వీస్ కంపెనీలు వినియోగదారులకు ఆధార్ ను లింక్ చేసుకోవాలని మొబైల్ ఫోన్లకు మెసేజ్ లను పంపుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ పధకాలకు సంబంధించి పలుచోట్ల లబ్ధిదారులకు డబ్బు జమకాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి అధికారులను హెచ్చరించింది.

 గుంటూరు, కృష్ణా జిల్లాల్లో

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో

ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉపాధి హామీ పధకం కింద వేతనం పొందాల్సిన సుమారు 30 వేల మందికి, అలాగే హౌసింగ్ స్కీమ్ లబ్దిదారులు 15 వేలమందికి ఆ డబ్బు అందకపోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ఖాతాలకు ఖాతాలకు ఆధార నంబర్ అనుసంధానం కాకపోవడమే ఈ సమస్యకు దారితీసినట్లు గుర్తించారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం నుంచి ఆధార్ అనుసంధానంపై ప్రకటన వెలువడిన నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమప్తమయ్యారు. పైగా వివిధ సంస్థలకు ఆధార్ అనుసంధానం చేసే విషయమై కేంద్రం గడువులను సైతం విధించడంతో ఆ విషయాన్ని సైతం ప్రజలకు తెలిసేలా మరోసారి విస్తృత ప్రచారం చెయ్యాలని అధికారులు ఆయా సంస్థలను కోరారు.

తుది గడువు గమనించండి

తుది గడువు గమనించండి

ఇక వివిధ సంస్థలకు ఆధార్ అనుసంధానం చేయడానికి విధించిన తుది గడువు వివరాలు ఇవి. బ్యాంకు ఖాతాకు,పాన్‌కార్డుకు ఈ ఏడాది డిసెంబర్ 31లోగార్‌, మొబైల్ సిమ్‌కార్డుకు మార్చి 2018 లోగా ఆధార్ ను అనుసంధానం చెయ్యల్సివుంటుంది. ఈ ప్రక్రియను ఆయా సంస్థల సర్వీస్ సెంటర్ల వద్ద పూర్తి చేస్తారు. ఆధార్ అనుసంధానం జరగగానే ఆయా సంస్థల నుంచి వినియోగదారులకు సమాచారం వస్తుంది.

 ప్రత్యేక సిబ్బంది కేటాయింపు

ప్రత్యేక సిబ్బంది కేటాయింపు

ఇక బ్యాంకులకు సంబంధించి ఆధార్‌ నమోదుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ఖాతాదారుడు బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌కార్డులతో బ్యాంకుకు వెళ్లాలి. అలాగే బయోమెట్రిక్, ఐరిస్ పద్దతుల ద్వారా కూడా ఆధార్ ను ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. ఇక బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చెయ్యకుంటే ఆ ఖాతాకు సంబంధించి లావాదేవీలు నిలిచిపోతాయని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The central government clarifies that Aadhaar now mandatory for bank accounts,pan card link it by Dec 31,2017 or lose access to banking. For mobiles the last date is march2018. Linking one’s Aadhaar with bank account can ensure direct benefits transfer of subsidies such as the LPG subsidy and digital life certification for pensioners.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి