• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతలో హీటెక్కిన రాజకీయం : రామగిరిలో పరిటాల సునీత నిరసన.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి సవాల్ !!

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా రాజకీయం హీటెక్కింది. టీడీపీ నేతలు మరింత దూకుడు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీక్షలు, ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. రైతుల సమస్యలపై మాజీ మంత్రి పరిటాల సునీత నిరసనకు దిగారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రామగిరి మండలం కేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. రైతులతో కలిసి సుమారు 100 ట్రాక్టర్లతో తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నిరసన చేపట్టారు. ఈ ర్యాలీలో 2వేల మంది రైతులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.

 రైతుల‌ను ద‌గా చేస్తున్న‌జ‌గ‌న్

రైతుల‌ను ద‌గా చేస్తున్న‌జ‌గ‌న్

సీఎంగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క కుంటుంబం సంతోషంగా లేదని పరిటాల సునీత విమర్శించారు. అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రిప్ పరికరాలు ఇంత వరకు రైతులకు ఇవ్వలేదు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌తో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని మండిపడ్డారు. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 పంట‌ను కొనుగోలు చేయ‌లేని స్థితిలో..

పంట‌ను కొనుగోలు చేయ‌లేని స్థితిలో..

రైతులకు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామంటూ సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యమని పరిటాల సునీత దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని ఆరోపించారు. కంది, వేరుశనగ రైతులు వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడుకు పేరుకే వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పేరూరు డ్యాంకు కోసం నాడు టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. వాటి పక్కదోవ పట్టించారని ఆరోపించారు.

 వైసీపీ ఎమ్మెల్యే భూ క‌బ్జాలు..

వైసీపీ ఎమ్మెల్యే భూ క‌బ్జాలు..


వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అక్రమాలకు , కబ్జాలకు అంతు లేకుండా పోయిందని సునీత ఫైర్ అయ్యారు. టమోట మండిల వద్ద కమిషన్లు, హైవేలో భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కడ భూమి కన్పిస్తే అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు. రైతులకు ఆదుకుంది చంద్రబాబే. న‌ష్టపోయిన‌ పంటల‌కు బీమా పరిహారం ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ అందించారు. ట్రాక్టర్లు ఇచ్చారు. సీఎం జగన్ మూడు రిజర్వాయర్లకు కొబ్బరి కాయకొట్టారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని సునీత ఎద్దేవా చేశారు.. ఇప్పటి వరకు ఎందుకు వీటిని పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే సీఎంను ఒప్పించి వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Viral Video : Tornado In Kadiri Mandal, Anantapuram District | భయపెట్టిన సుడిగాలి
 చ‌ర్చ‌కు సిద్ధ‌మా?

చ‌ర్చ‌కు సిద్ధ‌మా?

రాప్తాడు నియోజవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా ? అని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి సునీత సవాల్ విసిరారు. వైసీపీ చెంచాలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాటలను అదుపులో పెట్టుకోవలని పరిటాల శ్రీరాం హెచ్చరించారు. పేరూరు డ్యాం కాలువలకు భూములిచ్చిన రైతులకు ఇంత వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడే నాయకులు వైసీపీలో లేరని విమర్శించారు. రైతుల సమస్యలను రైతులే పరిష్కరించుకోవాలన్నారు. రైతు కలిసిక‌ట్టుగా పోరాటం చేసి సాధించుకోవాలని కోరారు. జగన్ రాక్షస పాలనను గమనించాలని కోరారు. రైతులు , కార్యకర్తలు రోడ్లెక్కాలి.. ప్రభుత్వ మెడలు వంచాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.

English summary
Ex minister Paritala Sunitha sensational comments on YCP MLA Prakash Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X