ఆమ్మో... ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గానా ?.. భయపడుతున్న సెలెబ్రిటీలు.. సెంటిమెంటా

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: మంచి గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తే చెడ్డ పేరుతో ఎపి ప్రభుత్వం దిమ్మ దిరిగేలా చేస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్లు...ఎపి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తుంటే వారంతా ఒకరిని మించి మరొకరు వివాదాల్లో చిక్కుకొంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు.

  Poonam Kaur Issue : పూనం కౌర్‌ సంచలనం : మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

  కారణాలేమైనా కానీ ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అచ్చిరావడం లేదు. ఎంపిక చేసిన రంగానికి పేరు ప్రఖ్యాతులు ఆర్జించి పెడతారని ఎపి ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తోంది. అయితే వారు తమకు కేటాయించిన రంగానికి మంచి పేరు, గుర్తింపు సంపాదించి పెట్టడం అటుంచి ఊహించని వివాదాల్లో చిక్కుకొని వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులే పోగొట్టుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లది. డౌటుంటే అలా వివాదాలు చుట్టుముట్టిన ఎపి బ్రాండ్ అంబాసిడర్ల లిస్ట్ పై ఓ లుక్కేయండి...మొదట అజయ్ దేవగన్ దంపతులు, ఆ తరువాత గజల్ శ్రీనివాస్, తాజాగా పూనమ్ కౌర్...వీరందరూ ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకున్నవారే కదా...

   ఆచి తూచి అడుగేసే...సిఎం

  ఆచి తూచి అడుగేసే...సిఎం

  మంచి అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరొందిన సీఎం చంద్ర‌బాబుకు ఎపి బ్రాండ్ అంబాసిడర్ల అంతా సీన్ రివర్స్ పరిస్థితే ఎదురైంది. ఏదేని విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగేసే సిఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ల నియామకం వ్యవహారంలో అంతా తేడా కొట్టింది. అయితే అది చంద్రబాబు కార్యదక్షతలో లోపం కాదని బ్రాండ్ అంబాసిడర్ల టైమ్ బ్యాడ్ చంద్రబాబుకు ప్రతికూలంగా పరిణమించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  ఎదురీదుతున్న చంద్రబాబును...ఇబ్బంది పెట్టేలాగా

  ఎదురీదుతున్న చంద్రబాబును...ఇబ్బంది పెట్టేలాగా

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత సుమారు 16 వేల కోట్ల రూపాయల లోటు బ‌డ్జెట్‌లో ఉన్న ఏపీని తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు సిఎం చంద్ర‌బాబు. ఒకవైపు కొత్త కొత్త సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశపెడుతూ మరోవైపు నూతన రాజ‌ధాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టును తమ చేతుల్లోకి తీసుకొని నిరంతరం ప‌రిశీలిస్తూ ప్రాజెక్ట్ పని పూర్తయేలా పరిశ్రమిస్తున్నారు. మ‌రి ఇంతలా చేస్తున్న‌ప్పుడు వీటికి త‌గిన విధంగా ప్ర‌చారం క‌ల్పించుకోవ‌డం అనే విష‌యంలో చంద్రబాబును మించి మరెవరూ చేయలేరనే భావిస్తారు. అయితే అలాంటి చంద్రబాబు తాను ప్రచారం కోసం ఏరికోరి ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్లే ప్రతిష్టను భ్రస్టు పట్టేలా చేస్తారని ఏమాత్రం ఊహించి ఉండరు.

   మొదటి అడుగే...అలా...

  మొదటి అడుగే...అలా...

  మొదట్లో రాజ‌ధాని నిర్మాణం, స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి కీల‌క ప్రాజెక్టుల విష‌యంలోనూ చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్ర‌చారం కోరుకున్నారు. ఈక్ర‌మంలోనే వాటి ప్రచారానికి సెల‌బ్రిటీలు ఉంటే బాగుంటుంద‌ని, మ‌రింత‌ ప్రాచర్యం పొందేలా వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తార‌ని ఆయ‌న అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌ధాని ప్ర‌చారానికి, ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా బాలీవుడ్ స్టార్ జోడీ అజ‌య్ దేవ‌గ‌న్‌, కాజోల్‌ను ఎంచుకున్నారు.వీరిని రాజ‌ధానికి పిలిచి మ‌రీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వారు యాక్టింగ్ స్టూడియో నిర్మించుకునేందుకు కూడా అనుమ‌తులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, అనూహ్యంగా పోల‌వారంపై వ‌చ్చిన వివాదం మాదిరిగానే వీరు కూడా వివాదంలో చిక్కుకున్నారు. వీరికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన కొన్ని రోజుల‌కే అజయ్ దేవ్ గన్ పేరు ‘పనామా' పత్రాల్లో బయటపడింది. విదేశాల్లో నల్లధనం దాచినవారిలో అజయ్ దేవగన్ కూడా ఉన్నట్లు ఈ ప‌త్రాలు వెల్ల‌డించాయి. దీంతో వీరిని చంద్ర‌బాబు సైలెంట్‌గా త‌ప్పించారు.

   ఆ తరువాత...కూడా

  ఆ తరువాత...కూడా

  విశాఖ పట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలో ఏ మాత్రం గుర్తింపులేని పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం ఏమిటనే విమర్శలు విన్పించాయి. అలాగే
  స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ శ్రీనివాస్ ను నియమించారు. ఇప్పుడు ఆయన ఏకంగా జైలుకే వెళ్లడంతో ఆయన్ను ఏపీ ప్రభుత్వం స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించింది. ఆయన ఏకంగా ఓ భయంకరమైన సెక్స్ స్కాండల్ కేసులో ఇరుక్కున్నారు. తాజాగా విమర్శకుడు కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ వివాదంతో జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ సిఫారసులతోనే ఏపీ ప్రభుత్వం పూనమ్ కౌర్ ను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని ఆరోపణలు ప్రాచుర్యం పొందాయి.

   వరుస వివాదాలతో...సెంటిమెంట్ గా...

  వరుస వివాదాలతో...సెంటిమెంట్ గా...

  ఇలా ఎపి బ్రాండ్ అంబాసిడర్లు అందరూ వివాదాల్లో కూరుకుపోతుండటంతో ఈ పదవిపై సెంటిమెంట్ కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రాండ్ అంబాసిడర్ గా వస్తే గుర్తింపు, ఆదాయం అటుంచి ఉన్న పేరు పోగొట్టుకొని అప్రతిష్ట పాలవుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు తమను బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోమని బతిమాలిన పలువురు తారలే ఇప్పుడు మొహం చాటేస్తున్నారట.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  All the AP Brand Ambassadors were caught in Controversies , it frightened the celebrities for future post.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి