కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌కు స‌వాల్ విసురుతున్న వైఎస్ కొండారెడ్డి?

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వెస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఆయ‌న బంధువు, క‌డ‌ప జిల్లా చ‌క్రాయ‌పేట మండ‌ల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి స‌వాల్ విసురుతున్నారు. చాగ‌ల‌మ‌ర్రి-రాయ‌చోటి మ‌ధ్య ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు చేస్తున్న ఎస్ఆర్కే క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీని డ‌బ్బులివ్వాలంటూ కొండారెడ్డి బెదిరింపుల‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. కంపెనీ ఫిర్యాదుల‌పై స్పందించిన పోలీసులు కొండారెడ్డిని అరెస్ట్ చేశారు.

 జిల్లా నుంచి బ‌హిష్క‌రించాలంటూ ప్ర‌తిపాద‌న‌లు

జిల్లా నుంచి బ‌హిష్క‌రించాలంటూ ప్ర‌తిపాద‌న‌లు

బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన కొండారెడ్డిని జిల్లా నుంచి బ‌హిష్క‌రించాలంటూ ఎస్పీ అన్బు రాజ‌న్ క‌లెక్ట‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. ఈ నేప‌థ్యంలో బ‌హిష్క‌ర‌ణ‌కు గురికాకుండా కొండారెడ్డి రివ‌ర్స్ గేమ్ ఆడుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మండ‌ల ప‌రిధిలోని 16 మంది గ్రామ స‌ర్పంచ్‌లు, 9 మంది ఎంపీటీసీల‌పై త‌న‌కు మ‌ద్ద‌తుగా ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలంటూ ఆయ‌న ఒత్తిడి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. వారిచేత రాజీనామాలు చేయించ‌డంద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు నిరూపించుకొని బ‌హిష్క‌ర‌ణ వేటును త‌ప్పించుకోవాల‌నేది ఆయ‌న వ్యూహ‌మ‌ని భావిస్తున్నారు.

 ఎంపీ అవినాష్‌రెడ్డిని క‌లిసిన స‌ర్పంచులు

ఎంపీ అవినాష్‌రెడ్డిని క‌లిసిన స‌ర్పంచులు


దీంతో న‌లుగురు స‌ర్పంచ్‌లు కొండారెడ్డి పీఏ ఓబుల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని క‌లిశారు. కొండారెడ్డిపై జిల్లా నుంచి బ‌హిష్క‌ర‌ణ వేటు వేస్తే తామంతా ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. అయితే ముఖ్య‌మంత్రి ఏ నిర్ణ‌యం తీసుకున్నా అమ‌లు కావాల్సిందేన‌ని, అంద‌రూ ఆ నిర్ణ‌యానికి త‌లొగ్గాల్సిందేన‌ని, ఇంత‌కంటే వేరేమార్గం లేదంటూ అవినాష్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం కొండారెడ్డి హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

 రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కొండారెడ్డి

రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కొండారెడ్డి


చ‌క్రాయ‌పేట మండ‌ల ప‌రిధిలో ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు చేస్తున్న ఎస్ ఆర్‌కే క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ త‌న‌కు రూ.5 కోట్లు ఇచ్చి ప‌నులు జ‌రుపుకోవాలంటూ కొండారెడ్డి బెదిరింపుల‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కంపెనీ అధినేత త‌న వియ్యంకుడు, బ‌ళ్లారి బీజేపీ ఎమ్మెల్యే శ్రీ‌రాములుకు విష‌యం తెలియ‌జేశారు. దీంతో బీజేపీ నేత‌లు విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ముఖ్య‌మంత్రి ఆదేశాల ప్ర‌కార‌మే కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 జిల్లా బ‌హిష్క‌ర‌ణే ప‌రిష్కారం

జిల్లా బ‌హిష్క‌ర‌ణే ప‌రిష్కారం


ఇదొక్క‌టే కాకుండా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా, ఏ ప‌ని జ‌రుగుతున్నా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఇప్ప‌టికే కొండారెడ్డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న్ను జిల్లా నుంచి బ‌హిష్క‌రించ‌డ‌మొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని ఎస్పీ నిర్ణ‌యించి ఆ మేరకు క‌లెక్ట‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు రేపో, మాపో నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

English summary
Kondareddy is playing a reverse game without being expelled from the district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X